Breaking News

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమానీ రాజస్థాన్ రాయల్స్ జట్టును రికార్డు స్థాయిలో ₹15,300 కోట్లకు కొనుగోలు

ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యం మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమానీ (Kal Somani) నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రికార్డు స్థాయిలో సుమారు ₹15,300 కోట్లకు ($1.63 బిలియన్లు) కొనుగోలు చేసింది. 


Published on: 24 Mar 2026 19:09  IST

ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యం మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమానీ (Kal Somani) నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రికార్డు స్థాయిలో సుమారు 15,300 కోట్లకు ($1.63 బిలియన్లు) కొనుగోలు చేసింది. 

కన్సార్టియంలో కల్ సోమానీతో పాటు వాల్‌మార్ట్ (Walmart) వారసుడు రాబ్ వాల్టన్, ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) జట్టు డెట్రాయిట్ లయన్స్ యజమానులైన హాంప్ ఫ్యామిలీ భాగస్వాములుగా ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీ అత్యధిక ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందంతో రాజస్థాన్ రాయల్స్ అత్యంత ఖరీదైన ఐపీఎల్ జట్టుగా అవతరించింది.ప్రస్తుత యాజమాన్యం మనోజ్ బదాలె నేతృత్వంలోనే ఐపీఎల్ 2026 సీజన్ వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ ముగిసిన తర్వాతే కొత్త యాజమాన్యం పూర్తి బాధ్యతలు స్వీకరిస్తుంది.ఈ కన్సార్టియం ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను దక్కించుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి