Breaking News

మార్కెట్‌లో అంతా చూస్తుండగానే.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి 80 లక్షలు చోరీ,

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారస్తుడు బ్యాంకుకు వెళ్లి 80 లక్షల రూపాయలను తీసుకున్నాడు. వాటిని తన బ్యాగులో పెట్టుకుని భుజాన వేసుకున్నాడు. ఆపై విపరీతమైన జనాలు ఉన్న ఓ మార్కెట్ గుండా నడుచుకుంటూ వెళ్లగా.. విషయం గుర్తించిన ఓ దుండగుడు ముఖానికి ముసుగు వేసుకుని మరీ వ్యాపారిని వెంబడించాడు. ఓచోట ఆపి తుపాకీతో బెదిరించి డబ్బులున్న బ్యాగు ఇవ్వమన్నాడు. లేదంటే చంపేస్తానంటూ బెదిరించగా.. వ్యాపారి భయపడి ఆ బ్యాగును ఇచ్చేశాడు.


Published on: 19 Mar 2025 23:29  IST

ఢిల్లీ మార్కెట్‌లో నడిరోడ్డుపై భారీ చోరీ – 

ఢిల్లీ: దేశ రాజధానిలో నడిరోడ్డుపై దోపిడీ చోటుచేసుకుంది. మధ్యాహ్నం బిజీ మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఓ దొంగ తుపాకీతో హల్‌చల్ చేస్తూ భారీ మొత్తాన్ని దోచుకెళ్లాడు. బ్యాంకు నుంచి రూ.80 లక్షలు డ్రా చేసుకున్న వ్యాపారిని టార్గెట్ చేసిన దుండగుడు, చాందిని చౌక్ మార్కెట్‌లో అతడిని అనుసరిస్తూ దాడికి తెగబడ్డాడు.

పట్టపగలే తుపాకీతో బెదిరింపు

బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్న వ్యాపారి నడుచుకుంటూ వెళ్తుండగా, అతడిని గమనించిన దొంగ ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా వెనుకే సాగాడు. ఓ ఇరుకు రోడ్డులోకి రాగానే, ముఖానికి ముసుగు ధరించి తుపాకీతో అడ్డగించి భయపెట్టేందుకు నేలపై కాల్పులు జరిపాడు.

ప్రాణభయంతో వణికిపోయిన వ్యాపారి, తన దగ్గర ఉన్న రూ.80 లక్షల ఉన్న బ్యాగును దొంగ చేతుల్లో పెట్టివేశాడు. డబ్బులు అందుకున్న దొంగ, కాల్పులు జరుపుతూనే పారిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక, బ్యాగును ఓ చోట పడేసి అందులోని డబ్బులను తీసుకుని ఉడాయించాడు.

సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు

తన డబ్బులు పోయిన షాక్ నుంచి కోలుకున్న వ్యాపారి తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, మొత్తం చోరీ ఘటన అందులో నమోదైంది. ప్రస్తుతం దొంగను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ సంఘటనతో ఢిల్లీలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బిజీ మార్కెట్‌ ప్రాంతంలో నడిరోడ్డుపై తుపాకీతో దోపిడీ జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి