Breaking News

వెల్‌కమ్ బ్యాక్ సునీతా.. పుడమి తల్లి మిమ్మల్ని మిస్ అయింది..: ప్రధాని మోదీ

9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఎట్టకేలకు సురక్షితంగా భూమ్మీదకు వచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ కాప్సూల్ బుధవారం రోజు తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో క్షేమంగా ల్యాండ్ కాగా.. ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికారు.


Published on: 19 Mar 2025 23:48  IST

భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్

సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ, భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి క్షేమంగా తిరిగి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన ఆమె, బుధవారం తెల్లవారుజామున అమెరికా ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. సునీతా సహా మిగిలిన వ్యోమగాములు సురిక్షితంగా భూమ్మీదకు రావడంతో.. ప్రంపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని మోదీ స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ సైతం వీరి రాకకోసం ఎదురు చూడగా.. వారు భూమ్మీదకు చేరుకున్నట్లు తెలిసిన వెంటనే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి మరీ సునీతా విలియమ్స్‌కు “వెల్‌కమ్ బ్యాక్ క్రూ 9.. భూమి మిమ్మల్ని చాలా రోజులుగా మిస్ అయింది” అంటూ ప్రేమతో స్వాగతం పలికారు. అంతరిక్షంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న సునీతా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారని, ఆమె అంకితభావాన్ని కొనియాడారు.

సునీతా విలియమ్స్ సాంకేతిక రంగంలో ఓ గొప్ప మార్గదర్శకురాలు అని అభివర్ణించిన మోదీ, అంతరిక్ష అన్వేషణలో ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. అంతేకాకుండా, ఆమెతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడంలో శ్రమించిన అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సునీతా విలియమ్స్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి