Breaking News

ట్రంప్‌, పుతిన్ ఫోన్ సంభాష‌ణ‌.. ఉక్రెయిన్ వార్‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌లేక‌పోయింది.

అమెరికా ప్ర‌తిపాదించిన 30 రోజుల కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పుతిన్ తిర‌స్క‌రించారు. దీంతో మ‌ళ్లీ ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాలు వైమానిక దాడుల‌కు దిగాయి.


Published on: 20 Mar 2025 00:11  IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు: కాల్పుల విరమణపై పెరుగుతున్న వివాదాలు

ఉక్రెయిన్‌కు మిలిట‌రీ స‌హాయాన్ని నిలిపివేస్తేనే పూర్తి స్థాయి కాల్పుల విమ‌ర‌ణ‌కు అంగీక‌రిస్తాన‌ని పుతిన్ స్ప‌ష్టం చేశారు. ట్రంప్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాక, మళ్లీ ర‌ష్యా వైమానిక దాడులు.దాడి వ‌ల్ల పౌర మౌళిక స‌దుపాయాల‌కు న‌ష్టం క‌లిగింద‌ని, సుమీలోని ఆస్ప‌త్రి డ్యామేజ్ అయిన‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

వైట్‌హౌస్ వర్గాల ప్రకారం, అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు జరపకూడదని పుతిన్ అంగీకరించారు. అయితే 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన నేపథ్యంలో, రష్యా-ఉక్రెయిన్ పై మళ్లీ వైమానిక దాడులకు పాల్పడ్డాయి. 

డ్రోన్ దాడులు, భారీ నష్టం

రష్యా జరిపిన తాజా దాడుల వల్ల సుమీలోని ఆసుపత్రి సహా పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అలాగే, ఉక్రెయిన్ భూభాగంపై 40కి పైగా రష్యా డ్రోన్లు దాడులు జరిపినట్లు ఆరోపించారు.

ఇదిలా ఉంటే, రష్యా-ఉక్రెయిన్ మధ్య 175 మంది ఖైదీలను పరస్పరం అప్పగించుకునేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే, ఈ ఆదివారం అమెరికా మద్దతుతో శాంతి చర్చలు జరగనున్నాయి.

ఉక్రెయిన్‌ ప్రతిస్పందన

జెలెన్‌స్కీ మాట్లాడుతూ, "రష్యా అసలు ఉద్దేశం ఏమిటనేది ఈ దాడుల ద్వారా స్పష్టమవుతోంది. వారు పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. సుమీ, కీవ్, జటోమిర్, చెర్నిహివ్ ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.

ట్రంప్‌తో చర్చలు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

ఇక పుతిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తాను త్వరలోనే ట్రంప్‌తో మాట్లాడతానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. "రష్యాతో చర్చల అంశంపై ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతాను. యుద్ధ నివారణకు తదుపరి చర్యల గురించి తెలుసుకుంటాను" అని  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే శాంతి చర్చలు వాస్తవిక పరిష్కారానికి దారి తీస్తాయా లేదా అనేది చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి