Breaking News

పొత్తుల అంశంపై ఢిల్లీకి జనసేనాని,, ఆ తర్వాతే అభ్యర్ధుల ప్రకటన?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఓ వైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే, మరోవైపు జనసేన తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై నిర్ణయం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. నిన్న విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు జనసేనాని.


Published on: 20 Feb 2024 16:01  IST

భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌, యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌లను నియమించారు  పవన్ కళ్యాణ్. అధికారికంగా అభ్యర్థులని కాకుండా 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు జనసేనాని.

గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ గెలిచింది. అంతకు ముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ  గణనీయమైన ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్క లేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజోలు, రాజానగరంలో పోటీ చేయబోతున్నట్టు జనసేనాని ప్రకటించారు.

అయితే పొత్తులు ఖరారు ఇంకా కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. నిన్న విశాఖలో పర్యటించిన జనసేనాని, నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. తూర్పు గోదావరి జిల్లా జనసేన అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు జనసేనాని. ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్న జనసేనాని, పర్యటన తర్వాత పొత్తులతో పాటు ఏయే సీట్లలో జనసేన పోటీ చేస్తుందనే అంశంలో క్లారిటీ రావొచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు.
 

Follow us on , &

ఇవీ చదవండి