Breaking News

300 కోట్ల విలువైన ఆలయ భూమికి ఎసరు!


Published on: 24 Oct 2025 14:07  IST

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు. సర్వే నంబర్‌ 365లోని 6.02 ఎకరాల్లో విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు కొంతకాలంగా కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో దేవాలయ భూమిని అక్రమంగా అమ్మిన అర్చకులే ఆ కుంటను తమకు అమ్మారని చెప్తున్నారు. ఆ స్థలాన్ని తాము తీసుకుంటామంటూ కోర్టును ఆశ్రయించారు.

Follow us on , &

ఇవీ చదవండి