Breaking News

ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి భేటి,, ఏం జరిగిందంటే?

ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, సజ్జల, బొత్స హాజరు అవ్వగా, అటు నల్లబ్యాడ్జీలతో ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ నేతలు హాజరైయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లపై చర్చిస్తున్నారు. అయితే ఈ నెల 27న ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది జేఏసీ.


Published on: 23 Feb 2024 14:38  IST

ఇవాళ్టి సమావేశంలో సానూకూలత వస్తే కార్యక్రమాన్ని పునరాలోచిస్తామన్నారు జేఏసీ. అయితే ఇప్పటికే ఛలో విజయవాడకు అనుమతి లేదని ఉద్యోగ సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఐఆర్, ఓపీఎస్ అమలు వంటి ప్రధాన డిమాండ్‌లతో జేఏసీ ఛలో విజయవాడకు పిలుపు నిచ్చాయి ఉద్యోగ సంఘాలు. సమావేశానికి వెళ్లే ముందు బొత్స ,సజ్జలను కలిసి సచివాలయ సీపీఎస్ సంఘం నేతలు వినతి పత్రాలు అందజేశారు, వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు. 
 

Follow us on , &

ఇవీ చదవండి