Breaking News

కువైట్‌లో తిరుపతి జిల్లా మహిళ ఆత్మహత్య

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లాకు చెందిన రేణుక (40) అనే మహిళ అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామానికి చెందిన రేణుక (40).ఆమె గత కొన్ని సంవత్సరాలుగా కువైట్‌లోని ఒక ఇంట్లో పనిమనిషిగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

Published on: 02 Jul 2026 19:42  IST

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లాకు చెందిన రేణుక (40) అనే మహిళ అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామానికి చెందిన రేణుక (40).ఆమె గత కొన్ని సంవత్సరాలుగా కువైట్‌లోని ఒక ఇంట్లో పనిమనిషిగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగా ఆమె మూడు రోజుల క్రితం కువైట్‌లోనే ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.రేణుక భౌతికకాయం జూలై 2, 2026 గురువారం నాడు స్వగ్రామానికి చేరుకుంది.ఆమె కుటుంబ సభ్యులు అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.రేణుకకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement