Breaking News

సీక్రెట్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వైసీపీ.. ఇదెక్కడి వ్యూహం నాయనా!!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాలుగో సిద్ధం సభకు సిద్ధమవుతోంది. మార్చి మొదటి వారంలో ఓ రేంజ్‌లో ఈ సభను కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటోంది. ఐదేళ్లలో ఏం చేసిందీ పక్కా లెక్కలతో ప్రజలకు చెబుతోంది. ఏ పథకానికి ఎంత మనీ ఖర్చు చేసిందీ. ఇలా ఐదేళ్లలో తాను రూ.2,25,000 కోట్లను లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లలో జమ చేయించాను అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇక్కడి వరకూ ఓకే.. కానీ కొత్తగా స్లిప్పుల పంపిణీ మొదలైనట్లు తెలిసింది.


Published on: 26 Feb 2024 11:12  IST

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి  వైసీపీ ఐదేళ్లలో ఈ పథకాలు అమలు చేసిందనీ, తద్వారా ఈ లబ్ది చేకూరిందని చెబుతూ లబ్దిదారులకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతీ కుటుంబానికీ స్లిప్పులు ఇస్తున్నారని సమాచారం. ఈ స్లిప్పుల్లో ఆయా లబ్దిదారులు ఐదేళ్లలో ఏ పథకాల ద్వారా లబ్ది పొందారు, మొత్తం ఎంత మనీ వారికి లబ్ది రూపంలో వచ్చిందీ వివరాలు ఉన్నాయని సమాచారం.

సీఎం జగన్ పాలనలో వివిధ పథకాలకు సంబంధించి ఒక్కో లబ్దిదారు కుటుంబమూ రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా లబ్ది పొందింది. ప్రధానంగా అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ఆసరా పెన్షన్, చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పంటల బీమా, పేదలకు ఇళ్లు వంటివి ఉన్నాయని తెలిసింది. ఇలా లబ్ది పొందిన వారు తిరిగి వైసీపీని గెలిపించాలని కొందరు వాలంటీర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.
 

Follow us on , &

ఇవీ చదవండి