Breaking News

తెనాలిలో పెద్ద గంజాయి ముఠా అరెస్ట్

జనవరి 31, 2026 శనివారం నాడు తెనాలి పోలీసులు ఒక పెద్ద గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 1,600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి గ్రామీణ సర్కిల్ డీఎస్పీ బి. జనార్దనరావు వెల్లడించారు. 

Published on: 31 Jan 2026 11:39  IST

జనవరి 31, 2026 శనివారం నాడు తెనాలి పోలీసులు ఒక పెద్ద గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 1,600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి గ్రామీణ సర్కిల్ డీఎస్పీ బి. జనార్దనరావు వెల్లడించారు. 

బాపట్ల జిల్లా స్టువర్ట్‌పురానికి చెందిన విజయ్ అనే వ్యక్తి విశాఖ ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఇతని నుండి తెనాలికి చెందిన గోపికిరణ్, మనుశంకర్, బసవేశ్వరరావు, జాకీర్‌హుస్సేన్ గంజాయిని కొని ఇతరులకు విక్రయిస్తున్నారు.

గంజాయి వినియోగిస్తున్న రోహిత్, సూర్యప్రకాష్, శివనాగమణికంఠ అనే ముగ్గురు యువకులను పోలీసులు తొలుత పట్టుకున్నారు. వీరిలో ఒకరు బీటెక్ మధ్యలో ఆపేయగా, మిగిలిన ఇద్దరు డిగ్రీ పూర్తి చేసినవారని సమాచారం ముఠా సభ్యులైన విజయ్, మనుశంకర్, బసవేశ్వరరావులపై గతంలో కూడా ఇదే తరహా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow us on , &

ఇవీ చదవండి