Breaking News

హాస్టల్ గదిలో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య

2026 ఫిబ్రవరి 24, మంగళవారం నాడు తిరుపతిలో జరిగిన ఈ విషాద ఘటన.మృతురాలిని తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువనగా గుర్తించారు.


Published on: 24 Feb 2026 13:58  IST

2026 ఫిబ్రవరి 24, మంగళవారం నాడు తిరుపతిలో జరిగిన ఈ విషాద ఘటన.మృతురాలిని తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువనగా గుర్తించారు.

ఈమె తిరుమల పట్టణంలోని 'సాయితేజ' అనే ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో నివసిస్తోంది.ఫిబ్రవరి 23, సోమవారం రాత్రి ఆమె తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం వెలుగులోకి వచ్చింది.భువన చదువులో చురుకైన విద్యార్థిని. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఆమె ఇన్ఫోసిస్ (Infosys) సంస్థలో రూ. 17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది.

తమ కుమార్తె మృతిపై హాస్టల్ యాజమాన్యం తమకు చాలా ఆలస్యంగా సమాచారం అందించిందని భువన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారు యూనివర్సిటీ సమీపంలో ఆందోళన నిర్వహించారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి