Breaking News

జ్వరంతో ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి

తిరుపతి జిల్లా రేణిగుంటలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థిని 2026 ఫిబ్రవరి 23న మృతి చెందింది. 


Published on: 24 Feb 2026 14:11  IST

తిరుపతి జిల్లా రేణిగుంటలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థిని 2026 ఫిబ్రవరి 23 మృతి చెందింది. సదరు విద్యార్థిని గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. కాలేజీ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత విద్యార్థిని చర్మంపై వాపు వచ్చిందని, పరిస్థితి విషమించడంతో ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని సమాచారం. వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థిని మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి