Breaking News

విద్యార్థులు అన్నిరంగాలలో రాణించాలి

కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ, విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాలలో రాణించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. 

Published on: 02 Mar 2026 18:36  IST

కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ, విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాలలో రాణించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. 

విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారు పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.కర్నూలులోని భాష్యం స్కూల్‌లో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు.

డాక్టర్ శంకర్ శర్మ వైద్య వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఆయన జర్నలిస్టుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి