Breaking News

ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీనివాస్ 

ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)గా ఎన్. శ్రీనివాస్ గారు సోమవారం, మార్చి 2, 2026 న బాధ్యతలు స్వీకరించారు.


Published on: 02 Mar 2026 18:55  IST

ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)గా ఎన్. శ్రీనివాస్ గారు సోమవారం, మార్చి 2, 2026 న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఖమ్మం ఆర్డీఓగా పనిచేసిన జి. నరసింహారావుగారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బదిలీ అయ్యారు. అదే సమయంలో మెట్‌పల్లిలో పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస్ గారిని ఖమ్మం ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ళ కూల్చివేత వివాదం నేపథ్యంలో ఈ ఆకస్మిక బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన డివిజన్ పరిధిలోని రెవెన్యూ అంశాలు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి