Breaking News

ప్రైవేట్ రిసార్ట్లో యువకుడి దారుణహత్య

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ మండలం, దొరగూడ గ్రామ పరిధిలో గల ఒక ప్రైవేట్ రిసార్ట్ సమీపంలో 2026 మార్చి 24న అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.


Published on: 25 Mar 2026 17:35  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ మండలం, దొరగూడ గ్రామ పరిధిలో గల ఒక ప్రైవేట్ రిసార్ట్ సమీపంలో 2026 మార్చి 24న అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.మృతుడు విజయనగరం జిల్లా, బొబ్బిలి సమీపంలోని జన్నీవలస గ్రామానికి చెందిన నాగల సురేష్ (25) గా గుర్తించారు.సురేష్ ఒక మహిళతో కలిసి కొన్ని రోజులుగా ఈ రిసార్ట్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

మార్చి 24వ తేదీ (మంగళవారం) రాత్రి సుమారు 10 గంటల సమయంలో, రిసార్ట్ పక్కనే ఉన్న రోడ్డుపై సురేష్ మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు.రిసార్ట్‌లో పనిచేసే సిబ్బందే ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి