Breaking News

ప్రియుడి మోజులో తల్లిని చంపిన కుమార్తె

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో (కౌకూర్ ప్రాంతం) ప్రియుడి మోజులో పడి ఒక కుమార్తె తన కన్నతల్లిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన మార్చి 25, 2026న వెలుగులోకి వచ్చింది. 

Published on: 25 Mar 2026 19:03  IST

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో (కౌకూర్ ప్రాంతం) ప్రియుడి మోజులో పడి ఒక కుమార్తె తన కన్నతల్లిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన మార్చి 25, 2026న వెలుగులోకి వచ్చింది. 

కుమార్తె ఇషిక మరియు ఆమె ప్రియుడు మౌంటీ రాజ్ (25).తల్లి తమ ప్రేమను అంగీకరించడం లేదని, తన ప్రియుడితో కలిసి ఉండనివ్వడం లేదని కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. సుమారు పది నెలల క్రితమే తల్లిని చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారు.హత్య చేసిన తర్వాత కుమార్తె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించింది.

నిందితుడు మౌంటీ రాజ్ మృతురాలి పేరు మీద ఉన్న స్కూటర్ (బైక్)ను మార్చి 24న అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది.పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. 

Follow us on , &

ఇవీ చదవండి