Breaking News

మార్కాపురం ఘటనపై చంద్రబాబు సమీక్ష

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో మార్చి 26, 2026 గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Published on: 26 Mar 2026 11:09  IST

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో మార్చి 26, 2026 గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీని ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 13 నుంచి 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని అవసరమైతే గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు.ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రవాణా మరియు పోలీసు అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే విజయవాడ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి