Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయంలో నేడు (16 జూన్ 2026) ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దైవ దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.


Published on: 16 Jun 2026 17:53  IST

కర్నూలు జిల్లా మంత్రాలయంలో నేడు (16 జూన్ 2026) ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దైవ దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఒరిస్సా అనే వ్యక్తి కుమారుడు కార్తిక్ (4) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.మంత్రాలయం శివారులో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం ముగించుకుని రోడ్డు దాటుతుండగా, కర్ణాటక నుండి యాత్రికులతో వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు బాలుడిని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే బాలుడు అక్కడికక్కడే మరణించగా, సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు విచారణ ప్రారంభించారు.బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన కర్ణాటక ఆర్టీసీ బస్సుపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.కళ్ల ముందే చిన్నారి కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని తీవ్రంగా కలచివేసాయి.

Follow us on , &

ఇవీ చదవండి