Breaking News

విజయనగరంలో పెళ్లిముచ్చట తీరకముందే విషాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి ముచ్చట తీరకముందే విషాదం నెలకొంది. తనూజ (24), వీరఘట్టం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విసినిగిరి చంద్రశేఖర్ కుమార్తె.ఈమెకు తన దగ్గరి బంధువైన ప్రసన్నకుమార్‌తో ఈ ఏడాది జులై 2న ఘనంగా వివాహం జరిగింది.


Published on: 21 Aug 2026 16:32  IST

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి ముచ్చట తీరకముందే విషాదం నెలకొంది. తనూజ (24), వీరఘట్టం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విసినిగిరి చంద్రశేఖర్ కుమార్తె.ఈమెకు తన దగ్గరి బంధువైన ప్రసన్నకుమార్‌తో ఏడాది జులై 2 ఘనంగా వివాహం జరిగింది.

ఆత్మహత్యకు గల కారణం

తనూజ ఇటీవల రాసిన AP TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షకు సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదలవగా, అందులో ఆమెకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో ఎంతో ప్రతిభావంతురాలైన ఆమె, మార్కులు తక్కువ రావడాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఆషాఢ మాసం ముగిసిన తర్వాత ఈ నెల (ఆగస్టు) 19నే ఆమె కన్నవారి ఇంటి నుంచి అత్తగారి ఊరైన చినరాజేరుకు తిరిగి వచ్చింది. గురువారం ఇంట్లో అత్తమామలు బ్యాంకు పని మీద బయటకు వెళ్లిన సమయంలో, మేడపై ఉన్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన రెండు నెలలు కూడా గడవకముందే, కేవలం పరీక్ష మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో నవవధువు తనువు చాలించడంతో ఇరు కుటుంబాలలో తీవ్ర శోకం మిగిలింది.

Follow us on , &

ఇవీ చదవండి