Breaking News

23న ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు అందించే ఉచిత కోచింగ్ కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఆగస్టు 23న జరగనుంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ పరీక్షకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించారు.

Published on: 21 Aug 2026 17:52  IST

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు అందించే ఉచిత కోచింగ్ కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఆగస్టు 23న జరగనుంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ పరీక్షకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించారు.

పరీక్ష సమయం: ఆగస్టు 23న ఉదయం 11:00 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.

రిపోర్టింగ్ టైమ్: రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అందరూ ఉదయం 9:00 గంటలకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

పరీక్షా కేంద్రాలు :

ఆదిలాబాద్ టౌన్: నలంద డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్.

ఉట్నూర్: చావర అకాడమీ.

కోచింగ్ ప్రారంభం: ఈ అర్హత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 24 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.

తెలంగాణ పోలీస్ ఎస్సై (SI), కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకే ఈ రాత పరీక్షను నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి