Breaking News

కైకరంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 29న (ఈరోజు) పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కైకరంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం నుంచే ఈ ఎన్నికల సందడి నెలకొంది.

Published on: 29 Sep 2026 18:53  IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 29న (ఈరోజు) పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కైకరంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం నుంచే ఈ ఎన్నికల సందడి నెలకొంది.

ఓటింగ్ సమయం:ఈరోజు ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/సంరక్షకులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎస్‌ఎంసీ సభ్యులను ఎన్నుకుంటున్నారు.

చైర్‌పర్సన్‌ ఎన్నిక: మధ్యాహ్నం 1:30 గంటలకు ఎన్నికైన సభ్యుల ద్వారా చైర్‌పర్సన్‌ మరియు వైస్‌ చైర్‌పర్సన్‌ల ఎన్నిక జరుగుతుంది.

ప్రమాణ స్వీకారం , తొలి సమావేశం: మధ్యాహ్నం 2:00 గంటలకు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి, పాఠశాల అభివృద్ధిపై మొదటి అధికారిక సమావేశాన్ని నిర్వహిస్తారు.

మారిన మార్గదర్శకాలు:
ఈ ఏడాది పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కమిటీ సభ్యుల సంఖ్యను 12 నుండి 25 మంది వరకు ఉండేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో కైకరం పరిధిలోని పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి