Breaking News

కడప లో ఒక విషాదకర ఘటన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.

కడప లో ఒక విషాదకర ఘటన , ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.


Published on: 14 Oct 2025 10:37  IST

అక్టోబర్ 13, 2025న కడపలో జరిగిన ఘోర సంఘటనలో, కుటుంబ కలహాల కారణంగా శ్రీరాములు (35), అతని భార్య శిరీష (30) మరియు వారి ఏడాదిన్నర కుమారుడు రిత్విక్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.  కడప రైల్వే స్టేషన్ సమీపంలోని మూడవ నంబర్ ట్రాక్.అక్టోబర్ 13న అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

శ్రీరాములు, శిరీష దంపతుల మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.అక్టోబర్ 13న కూడా గొడవలు జరగడంతో, శ్రీరాములు నానమ్మ సుబ్బమ్మ వారిని మందలించారు.నానమ్మ మందలింపుతో మనస్తాపం చెందిన శ్రీరాములు, తన భార్య, కుమారుడితో కలిసి కడప రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.అక్కడ ఒక గూడ్స్ రైలు వస్తుండగా దాని కింద పడి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరాములు, శిరీష మరియు రిత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే, వారి నానమ్మ సుబ్బమ్మ కూడా దుఃఖంతో మరణించారు.దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో, కడపలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహాలను పరిశీలించి, వాటిని పోస్ట్‌మార్టమ్ కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల ప్రకారం ఈ విషాదానికి కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు నిర్ధారించారు.ప్రస్తుతం రైల్వే పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి