Breaking News

వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్‌కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.


Published on: 02 May 2025 18:07  IST

అమరావతి రాజధాని ప్రారంభోత్సవ సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో మాట్లాడారు. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ, ఈ ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో, ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ, "మోదీ గారిని గతంలో కలిసినప్పుడల్లా హాస్యమయం, ఉత్సాహంగా ఉండేవారు. కానీ ఇటీవల అమరావతి కార్యక్రమానికి పిలవడానికి వెళ్లినప్పుడు ఆయన ముఖంలో గంభీరత కనిపించింది. దేశ ప్రజలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విషాదం ఆయన మనసును బాధించింది. ఈ సందర్భంలో మేమంతా దేశ ప్రయోజనాల కోసం మోదీ decisions‌కు అండగా ఉంటాం," అన్నారు.

అనంతరం హిందీలో మాట్లాడుతూ, “మోదీ జీ, హమ్ ఆప్ కే సాత్ హై. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ జనతా ఆప్ కే సాత్ హై. పూరా దేశ్ ఆప్ కే సాత్ హై” అని తెలిపారు.

సభ చివర్లో వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో సభా వేదిక మార్మోగింది. ముఖ్యమంత్రి నినాదాలు ఇచ్చిన వెంటనే ప్రధాని మోదీ స్వయంగా నిలబడి ప్రజలతో కలిసి నినాదాలు చేస్తూ దేశభక్తిని ప్రదర్శించారు. సభకు హాజరైన వారు జాతీయ జెండాలు చేతపట్టుకొని మోదీకి మద్దతు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి