Breaking News

జగన్ కు షాక్,, అన్నను గద్దె దింపి తీరుతా... వైఎస్ షర్మిల శపథం

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా శపధం చేశారు. ఏపీలో తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతానని వైయస్ షర్మిల శపథం చేయడం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల, వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించటం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో జగనన్న విసిరిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చర్చ జరుగుతుంది.


Published on: 12 Feb 2024 14:08  IST

తాజాగా తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గం లో పర్యటించిన వైయస్ షర్మిల అక్కడ రోడ్ షోలో పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయామని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో వేల ఉద్యోగాలు వచ్చేవని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి సీఎం జగన్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. నగరిలో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్యలను 12 సార్లు అన్నారు. వైయస్సార్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండగ అనేది కనిపిస్తుందని షర్మిల పేర్కొన్నారు.
 

Follow us on , &

ఇవీ చదవండి