Breaking News

ఇక లాంఛనమే


Published on: 14 Oct 2025 11:42  IST

వెస్టిండీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను టీమిండియా క్లీన్‌స్వీ్‌ప చేయడం ఇక లాంఛనమే. కానీ రెండో టెస్టులో విండీస్‌ బ్యాటర్ల పట్టువదలని పోరాటంతో సిరీ్‌సలో తొలిసారిగా ఆట ఐదో రోజుకు చేరడం గమనార్హం. అటు 121 పరుగుల లక్ష్య ఛేదనకు సోమవారం చివరి సెషన్‌లో బరిలోకి దిగిన భారత్‌ ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 63/1 స్కోరుతో ఉంది. క్రీజులో సాయి సుదర్శన్‌ (30), రాహుల్‌ (25) ఉన్నారు. ఇక, విజయానికి భారత్‌ కేవలం 58 పరుగుల దూరంలో ఉంది. దీంతో మంగళవారం తొలి సెషన్‌లోనే మ్యాచ్‌ ముగిసే చాన్సుంది.

Follow us on , &

ఇవీ చదవండి