Breaking News

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులో 2026, ఏప్రిల్ 25న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు.


Published on: 27 Apr 2026 18:10  IST

విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులో 2026, ఏప్రిల్ 25న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు.టెక్‌ మహీంద్రాలో పని చేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (33) (టీమ్ మేనేజర్) మరియు షేక్ తౌసీఫ్ (27) (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్).వీరిద్దరూ శనివారం ఉదయం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై భీమిలి వైపు వెళ్తుండగా, ఐఎన్ఎస్ కళింగ గేటు దాటి ఎర్రమట్టి దిబ్బల సమీపంలో అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, ఆపై విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కుశాల్ కుమార్ విశాఖలోని గోపాలపట్నం నివాసి కాగా, తౌసీఫ్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారు. వీరిద్దరికీ ఇంకా వివాహం కాలేదు.

 

Follow us on , &

ఇవీ చదవండి