Breaking News

అమరావతి కీలక ప్రాజెక్టులకు కాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పరిపాలనాపరమైన ఆమోదాలను ఈ రోజు (డిసెంబర్ 11, 2025) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. 


Published on: 11 Dec 2025 16:25  IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పరిపాలనాపరమైన ఆమోదాలను ఈ రోజు (డిసెంబర్ 11, 2025) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. 

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన మొత్తం రూ. 9,500 కోట్లు విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనా ఆమోదాలు లభించాయి.అమరావతిలో లోక్‌భవన్ (సెక్రటేరియట్ భవనం), అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు అతిథి గృహాలు మరియు సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనుల కోసం రూ. 532 కోట్లు విలువైన టెండర్లను పిలవడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఆమోదించిన 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించిన రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వీటి ద్వారా 56 వేలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి రూ. 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) ద్వారా పొందేందుకు గతంలో ఇచ్చిన జీవోను ఆమోదించారు.ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించారు. ఈ నిర్ణయాలు అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి