Breaking News

రోకలి బండతో కొట్టి అత్యంత దారుణంగా హత్య

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో 2025, డిసెంబర్ 22న ఒక దారుణ హత్య చోటుచేసుకుంది.


Published on: 22 Dec 2025 14:39  IST

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో 2025, డిసెంబర్ 22న ఒక దారుణ హత్య చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగావతి (30). ఈమె తన భర్త అహోబిలాన్ని సుమారు మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో నిందితురాలు.పెద్దయ్య ఈయన మృతురాలి మరిది (అహోబిలం సోదరుడు).

గతంలో తన అన్న అహోబిలాన్ని హత్య చేయించిందనే కోపంతో గంగావతిపై పెద్దయ్య కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే జైలు నుండి విడుదలైన గంగావతి గ్రామంలోనే ఉంటోంది.డిసెంబర్ 22, ఆదివారం అర్ధరాత్రి సమయంలో గంగావతి ఇంట్లోకి చొరబడిన పెద్దయ్య, ఆమెను రోకలి బండతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి