Breaking News

శ్రీ సత్యసాయి జిల్లాలో 4 ఏళ్ల బాలుడు హత్య

శ్రీ సత్యసాయి జిల్లాలో 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ కిడ్నాప్, హత్యకు గురైన సంఘటన నవంబర్ 27, 2025న వెలుగులోకి వచ్చింది.


Published on: 27 Nov 2025 11:00  IST

శ్రీ సత్యసాయి జిల్లాలో 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ కిడ్నాప్, హత్యకు గురైన సంఘటన నవంబర్ 27, 2025న వెలుగులోకి వచ్చింది.ఎన్.పి.కుంట మండలం గౌకనపేట గ్రామం.హర్షవర్ధన్ (4 ఏళ్లు), గంగాధర్, దంపతుల కుమారుడు.బుధవారం మధ్యాహ్నం నుంచి బాలుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం అదే గ్రామంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.ఈ నేరానికి పాల్పడింది బాలుడి పిన్ని భర్త ప్రసాద్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడు తన కొడుకు క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అడగగా, బాలుడి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మనస్తాపంతో ప్రసాద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి