Breaking News

ఆనందపురం సత్తరువు జంక్షన్ వద్ద ఘోరప్రమాదం

ఆగస్టు 31, 2026 (సోమవారం) ఉదయం విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని సత్తరువు జంక్షన్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు.

Published on: 31 Aug 2026 19:59  IST

ఆగస్టు 31, 2026 (సోమవారం) ఉదయం విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని సత్తరువు జంక్షన్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలంలోని సత్తరువు జంక్షన్ జాతీయ రహదారి.వేగంగా వచ్చిన కారు ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారులో భారీగా మంటలు వ్యాపించాయి.ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారు లోపల ఉన్న వ్యక్తి బయటకు రాలేకపోవడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

ప్రాథమిక నివేదికల ప్రకారం మరణించిన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా భావిస్తున్నారు. పోలీసులు కారు యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా బాధితుడి పూర్తి వివరాలు మరియు గుర్తింపును సేకరించే పనిలో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి