Breaking News

ఏపీలో 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ డీఎస్సీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో దరఖాస్తుల స్వీకరణ తో పాటు ఇతర ప్రక్రియలు కూడా మొదలయ్యాయి.


Published on: 12 Feb 2024 19:41  IST

రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. https://apdsc.apcfss.in/ పేరుతో రూపొందించిన  వెబ్ సైట్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. ఇందులో నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు,  ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు. అలాగే cse.ap gov.in వెబ్ సైట్ లోనూ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు.
డీఎస్సీ పరీక్షల్ని ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ గా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31 వరకు ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం ఉంటుంది అన్నారు. ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు, అనంతరం ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటనతో  ప్రక్రియ ముగుస్తుంది.
 

Follow us on , &

ఇవీ చదవండి