Breaking News

మార్చి 17న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి

జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో నిర్వహించగా, 22,341 మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,049 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 20,691 మంది మాత్రమే పరీక్ష రాశారు.


Published on: 03 Apr 2025 00:20  IST

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన మచిలీపట్నం

మచిలీపట్నం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. మార్చి 17న ప్రారంభమైన ఈ పరీక్షలు జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో నిర్వహించగా, 22,341 మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,049 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 20,691 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ పరీక్షలో అత్యధికంగా 358 మంది గైర్హాజరయ్యారు.

ఇందుకు ముందు జరిగిన ఇతర పరీక్షలలో కూడా కొందరు గైర్హాజరయ్యారు. తెలుగు పరీక్షకు 21,072 మంది రాయాల్సి ఉండగా 250 మంది, హిందీ పరీక్షకు 21,024 మందిలో 315 మంది, ఇంగ్లిష్ పరీక్షకు 21,040 మందిలో 244 మంది, గణిత పరీక్షకు 21,049 మందిలో 257 మంది, సాంఘిక శాస్త్రం పరీక్షకు 21,024 మందిలో 255 మంది గైర్హాజరయ్యారు.

మూల్యాంకనానికి సన్నాహాలు పూర్తి

ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు మొత్తం 1,91,627 జవాబు పత్రాలు వచ్చాయి. 1,196 మంది మూల్యాంకనాధికారులు (సీఈ, ఏఈలు) ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి