Breaking News

కారుతో పాటువాగులో కొట్టుకుపోయిన దంపతులు

కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన దంపతులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలో చోటుచేసుకుంది.


Published on: 25 Sep 2026 20:39  IST

కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన దంపతులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలో చోటుచేసుకుంది.

భారీ వర్షాల కారణంగా నున్న వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, నున్న గ్రామ టీడీపీ అధ్యక్షుడు, సహకార సంఘం అధ్యక్షుడు అయిన కలకోటి శ్రీనివాసరెడ్డి తన భార్యతో కలిసి గురువారం (సెప్టెంబరు 24) తెల్లవారుజామున కారులో పాలు తీసుకురావడానికి పశువుల కొట్టానికి బయలుదేరారు. చిన్న కంచి వద్ద వాగు ప్రవాహం తక్కువగా ఉందనే అంచనాతో వారు ముందుకు వెళ్లగా, ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి కారు సుమారు 20 మీటర్ల మేర నీటిలో కొట్టుకుపోయింది.

ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి సమయస్ఫూర్తితో స్టీరింగ్ తిప్పగా కారు ప్రవాహానికి ఎదురుగా తిరిగి సమీపంలోని చెట్లలో చిక్కుకుంది. కారు కొంత మేర నీటిలో మునిగిపోతుండటంతో ఆయన భార్య అప్రమత్తమై వెనుక సీటులోకి వెళ్లి తలుపులు తెరిచారు. ఈ ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు, స్థానికులు వెంటనే స్పందించి తాడు సహాయంతో దంపతులిద్దరినీ వరద నీటి నుంచి సురక్షితంగా బయటకు లాగి కాపాడారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వెంటనే దంపతులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని, వారి సమయస్ఫూర్తిని అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి