Breaking News

పనిమనిషి ఏ దొంగ

అక్టోబర్ 27, 2025న విజయవాడలో కోటి రూపాయల విలువైన బంగారు నగలను దొంగిలించిన కేసులో మాజీ పనిమనిషి చీపురుపల్లి సుమలత అలియాస్ లత (48)ని పోలీసులు అరెస్టు చేశారు. 


Published on: 28 Oct 2025 12:46  IST

అక్టోబర్ 27, 2025న విజయవాడలో కోటి రూపాయల విలువైన బంగారు నగలను దొంగిలించిన కేసులో మాజీ పనిమనిషి చీపురుపల్లి సుమలత అలియాస్ లత (48)ని పోలీసులు అరెస్టు చేశారు.  విజయవాడ, సూర్యారావుపేటలోని చిలుకుదుర్గయ్య వీధిలో నివసించే ఓ వైద్యుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది.పనిమనిషి ఇంట్లో రోజువారీ పనులు చేస్తుండగా, ఒక్కొక్కటిగా నగలని దొంగిలించింది. ఈ విధంగా కోటి రూపాయల విలువైన బంగారాన్ని దొంగిలించింది.

విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే నిందితురాలిని పట్టుకున్నారు.విచారణలో సుమలత తాను నేరం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె నుంచి దొంగిలించిన 837 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సుమలత గతంలో బాధితుడి ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ఈ పరిచయాన్ని ఉపయోగించుకొని దొంగతనానికి పాల్పడింది.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసి ఈ కేసును ఛేదించాయి.

Follow us on , &

ఇవీ చదవండి