Breaking News

అనకాపల్లిలో 60 తులాల వెండి వస్తువుల చోరీ

అనకాపల్లి జిల్లా గవరపాలెంలో జరిగిన ఈ భారీ చోరీ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం ప్రాంతంలో ఉన్న విజ్ఞాన సమితి సమీపంలో ఈ దొంగతనం జరిగింది.పెంటకోట సత్యవతి అనే మహిళకు చెందిన ఇంట్లో దుండగులు చొరబడ్డారు.


Published on: 07 Aug 2026 19:29  IST

అనకాపల్లి జిల్లా గవరపాలెంలో జరిగిన భారీ చోరీ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం ప్రాంతంలో ఉన్న విజ్ఞాన సమితి సమీపంలో ఈ దొంగతనం జరిగింది.పెంటకోట సత్యవతి అనే మహిళకు చెందిన ఇంట్లో దుండగులు చొరబడ్డారు.

గురువారం అర్ధరాత్రి వేళ (ఆగస్టు 6, 2026) కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంటి మేడపై నిద్రించడానికి వెళ్లారు. ఆ సమయాన్ని అదనుగా చూసుకుని దొంగలు కింది గదిలోకి ప్రవేశించారు.గదిలోని బీరువాను తెరిచి అందులో భద్రపరిచిన 60 తులాల వెండి వస్తువులతో పాటు ఐదున్నర తులాల బంగారం, ₹20,000 నగదును అపహరించుకుపోయారు.

శుక్రవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు కింద గదిలో బీరువా తెరిచి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి