Breaking News

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఆప్కాస్‌ను రద్దు చేయకుండా కార్మికులను పర్మినెంట్ చేయాలి.

మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీల ఆధీనానికి అప్పగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే ఆప్కాస్‌ను రద్దు చేయకుండా కార్మికులను పర్మినెంట్ చేయాలి.


Published on: 02 Apr 2025 23:45  IST

ఏలూరు (టూటౌన్): మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీల ఆధీనానికి అప్పగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే ఆప్కాస్‌ను రద్దు చేయకుండా కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

సీఐటీయూ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ,

 ప్రైవేటు ఏజెన్సీల చేతిలో కార్మికులను పెట్టడం అన్యాయం
 కాంట్రాక్టర్ల ఆధీనంలోకి మున్సిపల్ ఉద్యోగులు వెళ్లడం అంటే బానిసత్వంలోకి నెట్టడమే
 ప్రైవేటు సంస్థల్లో పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాల గ్యారెంటీ లేకపోవడం కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది తెలిపారు.

ప్రభుత్వ హామీలు అమలు చేయాలి

గత ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని కార్మిక నేతలు తెలిపారు.

 రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి
 ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలి
 ఇంజనీరింగ్ కార్మికులకు 36 నెంబర్ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలి
 దహన సంస్కారాల ఖర్చులను రూ. 20 వేలకు పెంచాలి

సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆందోళన చేపట్టేందుకు మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి. సోమయ్య, లావేటి కృష్ణారావు, అంగుళూరు జానుబాబు, బంగారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి