Breaking News

చంద్రబాబు తో నూతన సీఎస్ భేటీ

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) గా బాధ్యతలు చేపట్టిన జి. సాయి ప్రసాద్ (G. Sai Prasad), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకముగా కలిశారు. 

Published on: 02 Mar 2026 12:35  IST

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) గా బాధ్యతలు చేపట్టిన జి. సాయి ప్రసాద్ (G. Sai Prasad), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకముగా కలిశారు. 

శనివారం (ఫిబ్రవరి 28, 2026) బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆదివారం సాయంత్రం అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో సాయి ప్రసాద్ సిఎంను కలిశారు.నూతన సీఎస్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ కె. విజయానంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు.

రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా పరమైన అంశాలపై సీఎస్ కు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సాయి ప్రసాద్ మే 31, 2026 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

Follow us on , &

ఇవీ చదవండి