Breaking News

డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ 

ఫిబ్రవరి 7, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' (Quantum Valley) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


Published on: 09 Feb 2026 12:33  IST

ఫిబ్రవరి 7, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' (Quantum Valley) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఏపీలో మొదటి క్వాంటం కంప్యూటర్ డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు.సుమారు 85% క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను అమరావతిలోనే తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

దిగ్గజ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.ఏప్రిల్ 14న (అంతర్జాతీయ క్వాంటం దినోత్సవం) SRM విశ్వవిద్యాలయంలో రెండు దేశీయ క్వాంటం కంప్యూటర్లను రెఫరెన్స్ ఫెసిలిటీగా ప్రారంభించనున్నారు.

క్వాంటం రంగంలో ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే వారికి రూ. 100 కోట్ల భారీ బహుమతిని అందజేస్తామని ప్రకటించారు.2030 నాటికి సుమారు 2.5 లక్షల క్వాంటం నిపుణుల అవసరం ఉంటుందని, అందుకోసం 10 లక్షల మంది ఏపీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు IBM ముందుకు వచ్చిందని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి