Breaking News

తిరుమలలో రథసప్తమి వేడుకలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 16వ తేదీన నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.


Published on: 08 Feb 2024 13:27  IST

ఏడుకొండలపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో రథ సప్తమి వేడుకల ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈ  సంవత్సరం కూడా రథ సప్తమి వేడుకలకు టీటీడీ సిద్ధమైంది. రథ సప్తమి నాడు తిరు వీధులలో ఏడు ప్రధాన వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగే ఘట్టాన్ని చూడటం కోసం  తిరుమలకు భక్తులు భారీగా వస్తారు.
రథ సప్తమి నాడు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యం భక్తులను భక్తితో ముంచేస్తుంది. రథ సప్తమి నాడు ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం పై మలయప్ప స్వామిగా ఊరేగనున్నారు. ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు చిన్న శేష వాహనంపైనా ఊరేగనున్నారు .ఆ తర్వాత ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు.
ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు కల్పవృక్షంపై , 11.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 12.30 నుండి 1గంట వరకు తిరుచ్చిపై విహ‌రించి భ‌క్తుల‌ను దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు క‌టాక్షించ‌నున్నారు.
 

Follow us on , &

ఇవీ చదవండి