Breaking News

లారీ ఢీ యువ దంపతులు మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని నరేంద్రపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ దంపతులు మృతి చెందారు.


Published on: 05 Dec 2025 10:24  IST

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని నరేంద్రపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ దంపతులు మృతి చెందారు. ఈరోజు (డిసెంబర్ 5, 2025) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని లీలాప్రసాద్, సౌమ్యగా గుర్తించారు. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వారికి ఒక పాప కూడా ఉంది. 

రాజమండ్రి నుంచి నరేంద్రపురం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఈ జంటను వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.లారీ ఢీకొట్టడంతో దంపతులు రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యారు, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాల పరిస్థితి చూసి బంధువులు, స్థానికులు తీవ్రంగా కలత చెందారు. 

Follow us on , &

ఇవీ చదవండి