Breaking News

సినిమాకు లైన్ క్లియర్​.. థియేటర్లలోకి ఆ రోజే

ఏపీ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర రిలీజ్​కు ఎదురైన అడ్డంకులన్నీ తాజాగా తొలిగిపోయాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు మరోసారి వ్యూహం సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు తాజాగా యూ సర్టిఫికేట్​ను జారీ చేసింది. దీంతో వ్యూహం చిత్రం రిలీజ్​కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్ధంగా ఉంది.


Published on: 09 Feb 2024 19:47  IST

ఏపీ రాజకీయల నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్​ కాకముందే ఎంతో కాంట్రవర్సీని అందుకుంది. దీన్ని ఆపాలని చాలా మంది  ప్రయత్నాలు కూడా చేశారు. ఆ మధ్యలో అయితే వ్యూహం సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్​కు సిద్ధమైనప్పటికీ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. ఈ సినిమా రిలీజ్​ను నిలిపివేవయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించారని పిటిషన్‌లో లోకేశ్​ పేర్కొన్నారు. దీంతో వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్​ను రద్దు చేసిన న్యాయస్థానం. ఈ క్రమంలో  చిత్ర నిర్మాత, దర్శకుడు కూడా హైకోర్టును ఆశ్రయించి ప్రతిగా పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు సినిమాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికేట్​ను జారీ చేయాలని సెన్సార్ బోర్డుకు న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. 
న్యాయస్థానం ఆదేశాల మేరకు మరోసారి వ్యూహం సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు తాజాగా యూ సర్టిఫికేట్​ను జారీ చేసింది. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి