Breaking News

తిరుమల పట్టు వస్త్రాల కొనుగోళ్లలో భారీమోసం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పట్టు వస్త్రాల కొనుగోళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.


Published on: 11 Dec 2025 10:40  IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పట్టు వస్త్రాల కొనుగోళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన విచారణలో, గత పదేళ్లుగా (2015 నుండి 2025 వరకు) పట్టు శాలువాలకు బదులుగా నాసిరకం పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. 

టీటీడీ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ సిల్క్తో తయారైన పట్టు శాలువాలు (సరిగ దుపట్టాలు) కొనుగోలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు వాటికి బదులుగా 100% పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేశారు.ఈ మోసం కారణంగా టీటీడీకి సుమారు రూ. 54 కోట్ల నుంచి రూ. 55 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.విజిలెన్స్ తనిఖీలలో భాగంగా శాంపిల్స్ సేకరించి సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్‌లకు పంపగా, అవి పాలిస్టర్ వస్త్రాలని తేలింది. అలాగే, పట్టు వస్త్రాలపై ఉండాల్సిన తప్పనిసరి 'సిల్క్ హోలోగ్రామ్' కూడా లేదని గుర్తించారు.ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ ఛైర్మన్, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB)కి అప్పగించారు. 

Follow us on , &

ఇవీ చదవండి