

ట్రంకు రోడ్డుతో పాటు ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు
గురువారం ట్రంకు రోడ్డులోని వ్యాపారదారులు, చిన్నతరహా వ్యాపారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్సై జానకి రామయ్య.
Published on: 03 Apr 2025 23:23 IST
కావలి: పట్టణంలోని ట్రంకు రోడ్డుతో పాటు ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఒకటో పట్టణ ఎస్సై జానకి రామయ్య తెలిపారు. గురువారం ట్రంకు రోడ్డులోని వ్యాపారదారులు, చిన్నతరహా వ్యాపారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటికే పురపాలక అధికారులు ట్రంకు రోడ్డుకు ఇరువైపులా ఎనిమిది అడుగుల మేర పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారని, అందరూ ఈ నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా వ్యాపార స్థలాలను విస్తరించకుండా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జానకి రామయ్యతో పాటు ఎస్సైలు సుమన్, జమాల్ వలి కూడా పాల్గొన్నారు.