Breaking News

రాజధాని అమరావతిలో వైల్డర్నెస్ పార్కు అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి.

మూడేళ్లలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది.


Published on: 03 Apr 2025 14:39  IST

అమరావతిలో వైల్డర్నెస్ పార్క్ – పర్యావరణానికి కొత్త ఊపిరి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లుతోంది. మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైల్డర్నెస్ పార్క్ ఏర్పాటు కూడా ముఖ్యమైన ప్రాజెక్టుగా ప్రభుత్వం పరిగణిస్తోంది.

వైల్డర్నెస్ పార్క్ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేసేలా తీర్చిదిద్దనున్నారు. ఈ పార్కులో ప్రత్యేకంగా విలువైన వృక్షాలను పెంచడంతో పాటు, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలా రిసార్ట్‌లు, టెంటెడ్ క్యాంపులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని అధికారుల ఆలోచన.సామాన్య ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించేలా చర్యలు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ పార్కును అంతర్జాతీయ ప్రమాణాల్లో అభివృద్ధి చేయనున్నారు.ఈ వైల్డర్నెస్ పార్క్‌ను అమరావతి సెంట్రల్ పార్క్‌లో భాగంగా 300 ఎకరాల ప్రాజెక్టులో 20 ఎకరాలకు విస్తరించనున్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వం దీనిని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో దశల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 

పార్క్‌లో ప్రత్యేక ఆకర్షణలు

  • ఫారెస్ట్ థీమ్ సెటప్

  • బర్డ్స్ పార్క్

  • రైన్ ఫారెస్ట్ కేఫ్

  • టెంటెడ్ కాటేజీలు, క్యాంపులు

  • ఫారెస్ట్ రెస్టారెంట్

Follow us on , &

ఇవీ చదవండి