Breaking News

అమరావతి రైతుల ధైర్యాన్ని ప్రశంసించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.


Published on: 02 May 2025 18:33  IST

దేశానికి అన్ని మూలల నుంచి ప్రజల హక్కుల కోసం కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశంలో విపత్కర పరిస్థితుల మధ్య కూడా మోదీ గారు అమరావతి కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషకరమని పవన్ అన్నారు. ఆయన్ను కాపాడాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్టు చెప్పారు.

అమరావతి రైతుల పోరాటం విజయవంతం కావడం తాను గర్వంగా భావిస్తున్నానని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పవన్… గత ఐదేళ్లలో వారికెన్ని బాధలు ఎదురయ్యాయో అందరికి గుర్తుండే విషయమని అన్నారు. “లాఠీ దెబ్బలు తిన్నా, అవమానాలను ఎదుర్కొన్నా అమరావతి రైతులు వెనక్కి తగ్గలేదు,” అన్నారు పవన్.

"అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి మళ్లీ నిర్మాణ పనులు మొదలయ్యేలా చేయడం మాకెంతో గర్వకారణం. గత ప్రభుత్వం ఈ ప్రాంత భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేసినా, రైతుల ఆత్మవిశ్వాసం గెలిచింది," అని పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమంలో మహిళా రైతుల పాత్రను పవన్ ప్రత్యేకంగా కొనియాడారు. తాము మద్దతుగా నిలబడిన కూటమి ప్రభుత్వం రైతుల త్యాగాన్ని గుర్తించిందని స్పష్టం చేశారు. “రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి గొప్ప ఆశయాన్ని ఇచ్చారు,” అన్నారు.

చంద్రబాబు నాయుడిని ప్రస్తావిస్తూ, “సైబరాబాద్‌ను ఎలా రూపుదిద్దారో, అమరావతినీ అంతే విధంగా అభివృద్ధి చేస్తారు,” అన్న నమ్మకం వ్యక్తం చేశారు పవన్. “ఉగ్రదాడి తరుణంలోనూ ప్రధాని మోదీ అమరావతికి రావడం ఆయన యొక్క ఏపీపై నిబద్ధతకు నిదర్శనం,” అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి