Breaking News

చోడవరం కోర్టు చరిత్రలో ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.

2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది.


Published on: 01 Apr 2025 14:48  IST

వేపాడు దివ్య హత్య కేసు: నిందితుడికి మరణశిక్ష

2015లో సంచలనం సృష్టించిన వేపాడు దివ్య హత్య కేసులో అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు శేఖర్‌(31)కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె. రత్నకుమార్ తీర్పు ఇచ్చారు.

శేఖర్‌కు దివ్య కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు ఉండటంతో చిన్నారిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, బీరు సీసాతో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. పోలీసుల విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.

చోడవరం కోర్టు చరిత్రలో ఇది మొదటి మరణదండన తీర్పుగా నిలిచింది. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి