Breaking News

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై హోంమంత్రి అనిత స్పందన

పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనితస్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు.


Published on: 27 Mar 2025 15:21  IST

పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ తో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.హోంమంత్రి ఈ కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించాలని ఆమె సూచించారు. క్రైస్తవ సంఘాల విజ్ఞప్తి మేరకు పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్ చేయించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే,ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా కాకుండా,అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి