Breaking News

మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉద్యోగాలు భర్తీ

క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.


Published on: 02 May 2025 14:53  IST

ఆంధ్ర ప్రదేశ్:రాష్ట్రంలోని మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో భాగంగా, స్పోర్ట్స్ కోటా కింద 421 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భర్తీలు మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ మరియు సోషియల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో జరగనున్నాయి.

ఈ ఉద్యోగాలకు క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగనుంది. దరఖాస్తులు మే 2 నుంచి మే 31 వరకు ఆహ్వానించబడుతున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు sports.ap.gov.in లేదా sportsdsc.apcfss.in వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం

  • జిల్లావారిగా స్క్రీనింగ్ కమిటీలు ప్రాథమిక ఎంపిక చేస్తాయి.

  • రాష్ట్ర స్థాయి కమిటీ తుది జాబితాను ఆమోదిస్తుంది.

  • ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, "30 ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న అవకాశం ఇది. రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడా ప్రతిభ ఆధారంగా 3% రిజర్వేషన్‌ను ఇవ్వడం రాష్ట్రంలో తొలి సారి," అని పేర్కొన్నారు. ఈ విధానాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకొని నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి