Breaking News

తిరుమలలో గురువారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానం ప్రయాణించింది.

తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.


Published on: 27 Mar 2025 16:57  IST

తిరుమల | తిరుమలలో శ్రీవారి ఆలయంపై నుంచి మళ్లీ ఒక విమానం ప్రయాణించిందా అనే విషయం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపుతుంది ఆలయంపై నుంచి విమానం ప్రయాణం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీటీడీ ఇప్పటికే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు పలు మార్లు విజ్ఞప్తి చేసింది. అయితే, ఇప్పటికీ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని దేవస్థానం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయక్‌కు లేఖ రాశారు. అయినా, తరచుగా విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్తుండటం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.గతం లో కంటే ఈసారి విమానం గోపురానికి మరింత సమీపంగా వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తిరుమల దేవస్థానాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి