Breaking News

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థికశాఖను చంద్రబాబు ఆదేశించారు.


Published on: 21 Mar 2025 10:18  IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుకు ఆర్థికశాఖను ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న భారీ మొత్తాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులకు బకాయిల కింద చెల్లించాల్సిన రూ. 6,200 కోట్లు విడుదల చేసేందుకు ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ నిధులలో సీపీఎస్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ కింద చెల్లింపులు ఉంటాయని అధికారవర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, తీవ్రంగా నష్టపోయిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల జీతాలను సమయానికి అందజేస్తోందని, అలాగే ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తోందని.. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి